అధిక చెరుకు దిగుబడి కోసం రైతుల స్టడీ టూర్​ : మంత్రి శ్రీధర్​బాబు

అధిక చెరుకు దిగుబడి కోసం రైతుల స్టడీ టూర్​ :  మంత్రి శ్రీధర్​బాబు
  • మంత్రి శ్రీధర్​బాబు, ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి వెంట మహారాష్ట్ర వెళ్లిన రైతన్నలు  

నిజామాబాద్, వెలుగు : మహారాష్ట్ర సాంగ్లీలోని దత్త షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో అధిక దిగుబడి సాధిస్తున్న చెరుకు తోటల పరిశీలనకు ఆదివారం బోధన్ సెగ్మెంట్​రైతులు తరలివెళ్లారు. మంత్రి శ్రీధర్​బాబు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి, కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు నేతృత్వంలో రైతులు మహారాష్ర్టకు వెళ్లారు. 

బోధన్​లోని నిజాం చక్కెర ఫ్యాక్టరీ రీ–ఓపెన్​ చేయడానికి రెడీ అయిన సర్కారు.. ఇక్కడి రైతులను చెరుకు సాగువైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తోంది. అధిక దిగుబడి సాధించే చెరుకు రకాలను సాగుచేయించడానికి రైతులను సిద్ధం చేస్తున్నారు. కేరళ స్టేట్​కు చెందిన సీడ్​ను సాంగ్లీ ఫ్యాక్టరీ పరిధిలో పండించి అక్కడి రైతులు ఎకరానికి 60 నుంచి 70 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. ఈ రకం చెరుకులో 12.5 శాతం రికవరీ వస్తోంది. శ్రీదత్త షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గణపతిరావు పాటిల్ రైతులకు అవగాహన కల్పించారు.