ఇది ఫైనల్ : తెలంగాణ ఓటర్లు 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైపోయింది.. అతి ముఖ్యమైన ఓటర్ల జాబితా ఫైనల్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఓటర్లు 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది అని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 4వ తేదీన.. తెలంగాణ రాష్ట్ర ఓటర్ల తుది జాబితా ప్రకంటించారు.

  •  2023, జనవరి 5వ తేదీ తర్వాత 17 లక్షల 42 వేల 470 మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఇది 5.8 శాతం పెరుగుదల
  •  పురుష ఓటర్లు కోటి 58 లక్షల మంది
  •   మహిళా ఓటర్లు ఒక కోటి 58 లక్షల మంది
  •  18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు 8 లక్షల 11 వేల 640 మంది
  •  6 లక్షల 10 వేల 694 ఓట్లను తొలగించారు. వీళ్లలో కొంత మంది చనిపోయారు.. మరి కొంత మంది ఓటును బదిలీ చేసుకున్నారు.. మరికొన్ని బోగస్ ఓట్లు కారణంగా తొలగించబడ్డాయి.
  • 5 లక్షల 80 వేల 208 ఓటర్ల ఇంటి నెంబర్లలో సవరణలు, మార్పులు చేయబడ్డాయి.