వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆర్థిక శాఖ. మొత్తం 5 వేల 348 ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపింది. హెడ్ ఆఫ్ డిపార్ట్ మెంట్ లో 3,235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 1255 పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ లో 575 పోస్టులు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లో 11 , ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటిక్ మెడిసిన్ లో 34 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
ALSO READ :- Arundhati Nair: ప్రాణాలతో పోరాడుతోన్న హీరోయిన్ ..చికిత్సకు డబ్బుల్లేక ఆర్ధిక సాయం కోసం అభ్యర్ధన
వైద్య శాఖలో ఖాళీలను భర్తీకి చేయడానికి ఆర్థిక శాఖ అనుమతిస్తూ మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. రాష్ట్రంలో ఉన్న 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 2021 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న 4,356 పోస్టులను కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని ఆదేశించింది. వీటికి ఇంకా నోటిఫికేషన్ రావాల్సి ఉంది.