భారీ వర్షాలు.. సెక్రటేరియట్ కంట్రోల్ రూమ్కు 120 ఫిర్యాదులు

తెలంగాణలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.  వరద బాధితుల కోసం  సచివాలయంలోని మూడో అంతస్థులో  ఏర్పాటు చేసిన   కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి. 

సెప్టెంబర్ 1 నుంచి 2 వరకు 120 ఫిర్యాదులు వచ్చాయి.  అత్యధికంగా ఖమ్మం జిల్లా నుంచి ఫిర్యాదులు వచ్చాయి.  ఆయా జిల్లాల్లో పరిస్థితుల మేరకు ఇప్పటి వరకు 69 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.  ఇప్పటి వరకు 2761 మందికి పునరావాస కేంద్రంలో ఆశ్రయం కల్పించారు అధికారులు.

ALSO READ | నిండుకుండలా ప్రాజెక్టులు

మరో వైపు తెలంగాణ భారీ వర్షాలకు 16 మంది చనిపోయినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం.. వేల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. ప్రధాని మోదీ తెలంగాణలో స్వయంగా పర్యటించాలని కోరారు. తక్షణ సాయం కింద 2 వేల కోట్లు రిలీజ్ చేయాలని కోరారు.