తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పీడ్ పెంచారు. ఇటీవల హోటళ్లు రెస్టారెంట్లపై వరుసగా దాడులు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుట్కా, పాన్ మాసాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నికోటిన్, పొగాకుతో తయారయ్యే గుట్కా, పాన్ మసాలా తయారీ, అమ్మకంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.మే 24నుండి ఒక సంవత్సరం పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు అధికారులు.
The Commissioner of Food Safety has issued a notification prohibiting the manufacture, storage, distribution, transportation and sale of 𝐆𝐮𝐭𝐤𝐡𝐚 / 𝐏𝐚𝐧𝐦𝐚𝐬𝐚𝐥𝐚 which contains tobacco and nicotine, with effect from 24.05.2024.#HealthyTelangana #NicotineBan pic.twitter.com/IjucPX5HPa
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) May 26, 2024
పొగాకు, నికోటిన్ తో తయారయ్యే గుట్కా, పాన్ మసాలాలు ఆరోగ్యానికి యత్యంత ప్రమాదకరం. వీటి వాడకం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుంది. నోటి క్యాన్సర్, ఫైబ్రోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రధాన కారణం పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలా వాడకమే కారణమని చెప్పచ్చు. వారణాసిలో 55శాతం క్యాన్సర్ కేసులకు కారణం గుట్కా, పాన్ మసాలా వాడకమే అని తేలింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గుట్కా, పాన్ మసాలాపై శాశ్వతంగా నిషేధం విధిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.