హైదరాబాద్: నాగోల్ లక్కీ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం(నవంబర్ 7, 2024) తనిఖీలు నిర్వహించారు. పాడైపోయిన ఫుడ్ సర్వ్ చేస్తున్నారని స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెస్టారెంట్లో అధికారులు తనిఖీలు చేశారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. పాడైన బ్రకోలి, క్యాబేజీ ఉపయోగిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. రెస్టారెంట్కి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎల్బీనగర్ మధురం రెస్టారెంట్లో చికెన్లో వెంట్రుక వచ్చిందని కస్టమర్ ఫిర్యాదు చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రెస్టారెంట్లో కూడా తనిఖీలు చేశారు.
రెస్టారెంట్ కిచెన్ని తనిఖీ చేసి.. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని గుర్తించారు. ఈ రెస్టారెంట్కి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఉప్పల్ సురభి రెస్టారెంట్ ఫుడ్లో బొద్దింక వచ్చిందనే కంప్లైంట్తో తనిఖీలు చేశారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించి అధికారులు ల్యాబ్కు పంపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రెస్టారెంట్ యాజమాన్యానికి కూడా నోటీసులు ఇచ్చారు.