హైదరాబాద్ సిటీ, వెలుగు: శామీర్‌పేటలోని నల్సార్ వర్సిటీలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం మంగళవారం తనిఖీలు చేసింది. యూనివర్సిటీలో క్యాంటీన్ నిర్వహిస్తున్న శ్రీ సాయి గణేశ్ క్యాటరర్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు గుర్తించారు.
లేబుల్స్ లేని వస్తువులు, హానికరమైన సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, బొద్దింకలు, ఎలుకలు తిరుగుతుండడంతో అసహనం వ్యక్తం చేశారు. కిచెన్ లో స్టోర్ చేసిన పుచ్చకాయ, తర్బూజ సీడ్స్ లో పురుగులున్నాయని గుర్తించి, క్యాంటీన్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.