ట్యాంక్ బండ్ పై సంబురంగా దశాబ్ది వేడుకలు

ట్యాంక్ బండ్ పై సంబురంగా దశాబ్ది వేడుకలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరన దశాబ్ది వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల నేపథ్యలో హుస్సేన్ సాగర్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వివిధ రకాల ప్రదర్శనల కోసం కళాకారులు కదిలి వస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే స్టాళ్లు కూడా ఏర్పాటయ్యాయి.  సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆట వస్తువులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు.  వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

ప్రధాన వేదికపై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. లైవ్ ప్రసారం కోసం ఎల్ ఈడీ స్క్రీన్లు సిద్ధమయ్యాయి.  సాయంత్రం 6.30 గంటలకు  సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ కు హాజరై కార్నివాల్ ను వీక్షించే అవకాశం ఉంది. దశాబ్ది ఉత్సవాల  నేపథ్యంలో కాంగ్రెస్  పార్టీ ఏర్పాటు చేసిన శకటం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ శకటాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి ఇవాళ ఉదయం గాంధీ భవన్ వద్ద ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఉత్సవాలను వీక్షించేందుకు ప్రజలు తరలివస్తున్నారు.