
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తో పాటు పలు పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జనగామలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్, హనుమకొండలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్‌లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, భూపాలపల్లిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ములుగులో జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎంఎస్.ప్రభాకర్‌రావు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ములుగులో ఎమ్మెల్యే సీతక్క, హనుమకొండ జిల్లా శాయంపేటలో టీపీసీసీ సభ్యుడు గండ్ర సత్యనారాయణరావు, హనుమకొండలో డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్‌రెడ్డి, ములుకనూరులో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, గూడూరులో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు రాధ, జనగామలో నియోజకవర్గ ఇన్‌చార్జి చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి హాజరై జెండాను ఆవిష్కరించారు.
జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కాజీపేట నుంచి హనుమకొండలోని అదాలత్ జంక్షన్‌వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అమర వీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం సోనియాగాంధీ ఫొటోలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జనగామలో జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, వరంగల్ జిల్లా ధర్మారంలోని పార్టీ ఆఫీస్‌లో జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, హనుమకొండలో జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మహబూబాబాద్‌లో జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌రావు, తొర్రూరులో నియోజకవర్గ ఇన్‌చార్జి పెదగాని సోమయ్య, వరంగల్ శివనగర్‌లోని బీజేపీ తూర్పు నియోజకవర్గ పార్టీ ఆఫీస్‌లో జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్, సీనియర్ నాయకుడు సముద్రాల పరమేశ్‌తో కలిసి జెండాను ఆవిష్కరించారు. జనగామలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. - వెలుగు నెట్‌వర్క్
అలరించినసాంస్కృతిక కార్యక్రమాలు
సందర్భంగా జిల్లా కేంద్రాల్లో సాంస్కృతికకార్యక్రమాలు నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌లు జెండాలు ఆవిష్కరించి, ప్రగతి నివేదికలు చదివిన అనంతరం స్టూడెంట్లు, కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.