డిఫెన్స్ ఫోర్స్ కు కల్పిస్తున్న సౌలతులు మాకూ ఇవ్వాలి

డిఫెన్స్ ఫోర్స్ కు కల్పిస్తున్న సౌలతులు మాకూ ఇవ్వాలి
  • తెలంగాణ మాజీ కేంద్ర సాయుధ బలగాల సంక్షేమ సంఘం  

ముషీరాబాద్, వెలుగు : రాష్ట్రంలో డిఫెన్స్ ఫోర్స్​కు కల్పిస్తున్న సౌలతులు తమకూ కల్పించి, ఇంటి పన్ను రద్దు చేయాలని తెలంగాణ కేంద్ర సాయుధ పోలీస్ బలగాల మాజీ సిబ్బంది సంక్షే మ సంఘం డిమాండ్ చేసింది. పాత పెన్షన్  విధానాన్ని తీసుకురావాలని కోరింది. బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్రస్థాయి సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు.  సంఘం అధ్యక్షుడు కె. శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ.. రిటైర్డ్  కేంద్ర సాయుధ బలగాల సిబ్బందిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సీఏపీఎఫ్​ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. 

ఇంజినీరింగ్, ఎంబీబీఎస్​ సీట్లలో తమ పిల్లలకు క్యాబ్ కోటాను వర్తింపచేయాలన్నారు.  సీఏపీఎఫ్ సభ్యుల కోసం హైదరాబాద్​లో కమ్యూనిటీ సెంటర్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వ రేటు ప్రకారం ఇంటి స్థలాలు మంజూరు చేయాలన్నారు. 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సైనిక దళాలకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను మాజీ సీఏపీఎఫ్ సభ్యులకు వర్తింపచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి వేశారు.