కుంభమేళలో తప్పిపోయిన తెలంగాణ మహిళలు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

కుంభమేళలో తప్పిపోయిన తెలంగాణ మహిళలు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

కుంభమేళాలో తెలంగాణకు చెందిన  ఒకే కుటుంబానికి నలుగురు మహిళలు తప్పిపోయారు.   జగిత్యాల జిల్లాలోని విద్యానగర్‌కు చెందిన నరసవ్వ(55), కొత్తవాడకు చెందిన రాజవ్వ(55) కాగా మరో ఇద్దరు నిర్మల్ జిల్లాలోని కడెంకు చెందిన బుచ్చవ్వ(65), సత్తవ్వ(55)గా పోలీసులు గుర్తించారు.  కుంభమేళాకు వెళ్లిన  మహిళలు  జనవరి 29 బుధవారం సాయంత్రం సుమారు 6 గంటలకు తప్పిపోయారు. వీరి వయస్సు 55 సంవత్సరాలకు పైబడి ఉంది. 

జనవరి 29 బుధవారం ప్రయాగరాజ్ స్నాన గట్టు వద్ద స్నానానికి వెళ్తుండగా ఆరుగురు ఒక ఆటోలో నలుగురు ఇంకో ఆటోలో వెళ్ళగా ముందు ఆటో వెళ్లిపోగా వెనుక  ఆటో ట్రాఫిక్ లో జామ్ అయి నలుగురు తప్పిపోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా తెలంగాణకు చెందిన 11 మంది మహిళలు కుంభమేళాకు చేరుకున్నారు. ఆరోజున తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఈ మహిళలు తప్పిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారి ఆచూకిని ఎలాగైన కనిపెట్టి ఇంటికి రప్పించాలని పోలీసులను కోరుతున్నారు.