జగిత్యాల పట్టణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండవగా సాగుతన్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా లంభోదరుడు భక్తుల నుంచి విశేష పూజలందుకుంటున్నాడు. పట్టణంలోని టవర్ సర్కిల్ శివవీధిలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య మండపాన్ని భక్తులు కరెన్సీ నోట్లతో అలంకరించారు.
మొత్తం 11 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించి గణేషుడికి పూజలు నిర్వహించారు.. కరెన్సీ నోట్లతో అలంకరించిన గణనాథున్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మరోవైపు గత 12 ఏళ్లుగా కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.