పాత పెన్షన్​ విధానాన్ని పునరుద్ధరించాలి: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం

పాత పెన్షన్​ విధానాన్ని పునరుద్ధరించాలి: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం

హైదరాబాద్​సిటీ, వెలుగు: సీపీఎస్, యూపీఎస్​ను రద్దు చేసి పాత పెన్షన్​విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ గెజిటెడ్​ అధికారుల సంఘం తీర్మానించింది. హైదరాబాద్ జిల్లా శాఖ సమావేశం గురువారం మెట్రోవాటర్​ బోర్డులో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ హాజరై మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.