- జెన్ కో థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య
పాల్వంచ, వెలుగు : విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు సంస్థ క్రీడల్లో ఫస్ట్ ప్రయార్టీ కల్పిస్తుందని తెలంగాణ జెన్కో థర్మల్ డైరెక్టర్ బాధావత్ లక్ష్మయ్య అన్నారు. పాల్వంచలోని కేటీపీఎస్ 7వ దశ స్పో ర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన జెన్కో ఇంటర్ ప్రాజెక్టు ఫుట్ బాల్, బ్యాడ్మింటన్ పోటీల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగులు మెరుగైన విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తూనే క్రీడలపై దృష్టిసారించాలన్నారు. ఫుట్ బాల్ క్రీడలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో కేటీపీఎస్ 5 ,6 , 7, కేటీ పీపీ నిలిచాయి.
బాల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను వరుసగా శ్రీశైలం, కేటీపీపీ, కేటీపీఎస్ 7వ దశ జట్లు సాధించాయి. విజేతలకు బహుమతులను అందజేశారు. కేటీపీఎస్ కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్లు పి.వెంకటేశ్వరరావు, ఎం.ప్రభాకర్ రావు, శ్రీనివాస బాబు స్పోర్ట్స్ సెక్రటరీలు వై.వెంకటేశ్వర్లు, వీరస్వామి, కల్తి నరసింహారావు పాల్గొన్నారు.