హాకీ నేషనల్ క్యాంప్‌‌‌‌‌‌‌‌లో జ్యోతి రెడ్డి

హాకీ నేషనల్ క్యాంప్‌‌‌‌‌‌‌‌లో  జ్యోతి రెడ్డి

బెంగళూరు: తెలంగాణ అమ్మాయి ఈదుల‌‌‌‌‌‌‌‌ జ్యోతి రెడ్డి ఇండియా విమెన్స్ హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌ నేషనల్ క్యాంప్‌‌కు ఎంపికైంది.  వచ్చే నెల 11 నుంచి స్వదేశంలో  జరిగే విమెన్స్ ఆసియా చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీకి సన్నాహకంగా బెంగళూరులోని సాయ్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం నుంచి అక్టోబర్ 9 వరకు ఈ క్యాంప్‌‌‌‌‌‌‌‌ జరుగుతుంది. ఇందులో సత్తా చాటిన వారిని మెగా టోర్నీలో పోటీ పడే ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌కు ఎంపిక చేస్తారు. కాగా, నేషనల్ క్యాంప్‌‌‌‌‌‌‌‌కు ఎంపికైన జ్యోతిని శాట్ చైర్మన్‌‌‌‌‌‌‌‌ శివసేనా రెడ్డి అభినందించారు.