అయోధ్యలోని సరయూ నదిలో కొట్టుకుపోయిన తెలంగాణ అమ్మాయి

అయోధ్యలోని సరయూ నదిలో కొట్టుకుపోయిన తెలంగాణ అమ్మాయి

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో ఘోరం జరిగింది. తెలంగాణకు చెందిన యువతి సరయూ నదిలో గల్లంతైంది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లాకు చెందింన  తాళ్లపల్లి నాగరాజు కుటుంబం జూలై 28, 2024 నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యకు వెళ్లారు. ఈ క్రమంలోనే జూలై 29 నాడు దైవ దర్శనం కోసం కుటుంబ సమేతంగా అందరూ సరయూ నదిలో స్నానాలు చేయడానికి వెళ్లారు.

 అదే కుటుంబానికి చెందిన ఐదుగురు యువతులు నదిలో స్నానం చేస్తుండగా గల్లంతయ్యారు. స్థానికులు అప్రమత్తమై యువతులను కాపాడేందుకు నదిలోకి దూకారు. అందులో నలుగురిని కాపాడగ తేజశ్రీని కనుగొనలేకపోయారు. నిన్నటి నుంచి రెస్క్యూ టీం తేజశ్రీ కోసం గాలిస్తుంది. తేజశ్రీ జనగామ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

 యువతి గల్లంతయ్యి 24 గంటలు కావస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు యువతిని గాలిస్తున్నామని తెలిపారు.