రంజాన్ మాసంలో.. 24 గంటలు దుకాణాలు ఓపెన్..

రంజాన్ మాసంలో.. 24 గంటలు దుకాణాలు ఓపెన్..

రంజాన్ మాసంలో హైదరాబాద్ లో దుకాణాలు 24 గంటలు ఓపెన్ ఉండేందుకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 2నుంచి 31 వరకు అన్ని దుకాణాలు, సంస్థలు రోజు మొత్తం తెరిచి ఉంటాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. రంజాన్ మాసంలో ప్రజలకు సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంది. ఈమే రకు తెలంగాణ హైదరాబాద్ కార్మిక శాఖ కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు. 

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులు గంట ముందుగా కార్యాలయాలనుంచి  బయలుదేరడానికి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే హిందూ పండుగల సమయంలో అలాంటి చర్యలు ఎందుకు పొడిగించబడవని ప్రతిపక్ష బీజేపీ విమర్శించింది.

సర్క్యులర్ ప్రకారం..ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ,అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, బోర్డులు, కార్పొరేషన్లు ,ప్రభుత్వ రంగ ఉద్యోగులతో సహా ముస్లిం ఉద్యోగులు మార్చి2 నుంచి మార్చి 31 వరకు రంజాన్ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు అంటే ఒక గంట ముందుగా కార్యాలయాల నుండి బయలుదేరడానికి అనుమతిచ్చింది.