సింగరేణి కార్మికులకు బోనస్..లాభాల్లో 32 శాతం వాటా

సింగరేణి కార్మికులకు శుభవార్త.  సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సింగరేణి సంస్థ లాభాలను కార్మికులకు పంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 2022 -23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం లాభాన్ని కార్మికులకు బోనస్ గా అందించనున్నారు. 

Also Read :- రెండు రోజులు వైన్స్, బార్లు బంద్

సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.  తెలంగాణ ఏర్పడిన నాటి‌ నుండి సింగరేణి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతోందన్నారు. బొగ్గు గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కొనియాడారు.