హైదరాబాద్​ సీపీగా సీవీ ఆనంద్..​ విజిలెన్స్ ​డీజీగా శ్రీనివాస్ రెడ్డి బదిలీ

హైదరాబాద్​ సీపీగా సీవీ ఆనంద్..​  విజిలెన్స్ ​డీజీగా శ్రీనివాస్ రెడ్డి బదిలీ
  •  ఏసీబీ డీజీగా విజయ్ కుమార్​కు బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: పోలీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మళ్లీ ఐపీఎస్ ల బదిలీలు మొదలయ్యాయి. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఏసీబీ డీజీగా ఉన్న సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను మళ్లీ హైదరాబాద్ సీపీగా నియమించింది. శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీజీ, జీఏడీ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది. ఇక ఏసీబీ డీజీగా విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్​కు బాధ్యతలు అప్పగించింది. సీఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పోలీస్​పర్సనల్స్ అండ్ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీజీగా లాఅండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, పోలీస్  స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐజీగా ఎం.రమేశ్​కు అదనపు బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే మరికొంత మంది పోలీస్ అధికారుల బదిలీ జరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కాగా, ఏసీబీ డీజీగా విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. సిటీ సీపీగా సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. 

శ్రీనివాస్ రెడ్డి మార్పుపై చర్చ.. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీపీ శ్రీనివాస్ రెడ్డిని మార్చడంపై డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చర్చ జరుగుతున్నది. చాలా తక్కువ సమయంలోనే ఆయనను బదిలీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి డీజీపీ అంజనీకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిటీ సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత శ్రీనివాస్ రెడ్డిని సిటీ సీపీగా నియమించారు. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఈ 8 నెలల్లో సిటీ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆశించిన ఫలితాలు లేవని.. లా అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యలు పెరిగాయని ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు సమాచారం. మరోవైపు త్వరలో గణేశ్ నిమజ్జనం ఉండడంతో సిటీపై పట్టున్న సీవీ ఆనంద్​కు ప్రభుత్వం మరోసారి బాధ్యతలు అప్పగించింది. కాగా, 4 రోజుల క్రితమే శ్రీనివాస్ రెడ్డి సెలవుపై వెళ్లినట్టు తెలిసింది. లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ విక్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్ మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.