- హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్
న్యూఢిల్లీ, వెలుగు: మెడికల్ అడ్మిషన్ల స్థానికతపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ శాశ్వత నివాసులు రాష్ట్రం బయట చదువుకున్నంత మాత్రాన స్థానిక రిజర్వేషన్ వర్తించదన్న ప్రభుత్వ నిబంధనను కొట్టివేస్తూ ఇటీవల రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణలో చదువుకోలేదన్న కారణంతో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ నిరాకరించరాదని ఆదేశాల్లో పేర్కొంది.
ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిని వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు తెలంగాణ తరపు న్యాయవాదులు మెన్షన్ చేశారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం... త్వరగా విచారణకు తీసుకుంటామని వెల్లడించింది.