గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ టికెట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీ నిర్మాత దిల్ రాజు తెలంగాణలోనూ టికెట్ల పెంపు కోసం చాలా విధాలుగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బుధవారం జనవరి 8న రేవంత్ రెడ్డి ప్రభుత్వం టికెట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సినిమా విడుదలయ్యే ఈ నెల 10న ఒకరోజు 6 షోలకు పర్మిషన్ ఇచ్చారు. రిలీజ్ రోజు శుక్రవారం ఉదయం 4 గంటల షోతోపాటు 6 షోలు పడనున్నాయి. తొలిరోజు మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా రూ.150, సింగిల్ స్క్రీన్స్ టికెట్ కు అదనంగా రూ.100 పెంచుకునేందుకు ఓకే చెప్పారు. 11 నుంచి 19వ తేదీ వరకు 5 షోలు నడిపించుకోవచ్చని.. ఆ రోజుల్లో మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా రూ.100, సింగిల్ స్క్రీన్స్ టికెట్ కు అదనంగా రూ.50 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు.
Also Read : ‘డాకు మహరాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
ఈ మూవీ రేపు శుక్రవారం (జనవరి 10న) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ కు రెండ్రోజుల ముందు వరకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్ లైన్ లో పెట్టకపోయేసరికి మెగా ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అయ్యారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం నుండి టికెట్ల పెంపు విషయంపై ఆలస్యం అవ్వడంతో బుకింగ్స్ అందుబాటులోకి రాలేదు. ఇక ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ షురూ కావడంతో తెలుగు ఆడియన్స్ లో పండుగ మొదలైనట్టుంది.