తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..రాష్ట్రంలో మయోనైజ్ బ్యాన్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..రాష్ట్రంలో  మయోనైజ్ బ్యాన్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మయోనైజ్ ను నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులతో చర్చల అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం తీసుకున్నారు.   కల్తీ ఆహారం తిని అనారోగ్యం బారిన పడుతున్న క్రమంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మోమోస్ తిని మహిళ మృతి

హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్ నందినగర్.. సింగాడికుంటలో అక్టోబర్ 27న  వీకెండ్ ఏర్పాటు చేసిన సంతకు రేష్మ బేగం అనే మహిళ (31) తన ముగ్గురు పిల్లలతో కలిసి వెళ్లింది. మోమోస్​తో మయోనీస్ కలిపి తిన్నది. కొద్దిసేపటికే ఆమెకు వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్​కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 27న చనిపోయింది.

సికింద్రాబాద్ బన్సీలాల్​పేట డివిజన్ పరిధిలో ఇటీవల మోమోస్ తో  తిన్న ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల కింద సెక్రటేరియెట్ సమీపంలోని ఫుడ్​స్టాల్​లో బన్సీలాల్​పేటకు చెందిన వినయ్ (33), దీప్తి(30), మితేశ్​(19), షణ్ముకప్రియ (16), తన్విత శ్రీయ(13) చికెన్ మోమోస్ తిన్నారు. మరుసటి రోజు వీళ్లంతా కడుపునొప్పి, విరేచనాలతో పద్మారావునగర్​లోని ప్రైవేట్ హాస్పిటల్​లో చేరారు. రెండ్రోజులు ట్రీట్​మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యాక మళ్లీ అస్వస్థతకు గురవడంతో సోమవారం కవాడిగూడలోని మరో హాస్పిటల్​లో అడ్మిట్ అయ్యారు.