తెలంగాణలో పెరగనున్న లిక్కర్ రేట్లు.?

తెలంగాణలో పెరగనున్న లిక్కర్ రేట్లు.?
  • బీర్​పై రూ.15–20,​ క్వార్టర్​పై రూ.10–80 వరకు పెంచే చాన్స్​
  • కనీసం 20-–25 శాతం పెంచేందుకు నిర్ణయం
  • ప్రతిపాదనలు రెడీ చేస్తున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లిక్కర్​ రేట్లను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు ఎక్సైజ్​ శాఖ ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.  ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. లిక్కర్​ రేట్లను కొంతమేర పెంచాలని నిర్ణయించింది. తొలుత మద్యం ధరలు పెంచొద్దని అనుకున్నప్పటికీ.. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు తగ్గట్టుగా మార్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.  బీర్​పై రూ.15–20,  క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రూ.10  నుంచి రూ.80  వరకు పెంచేలా ప్లాన్​ చేస్తున్నారు. ఇందులో చీప్​ లిక్కర్​ బ్రాండ్లపై తక్కువ, ఇతర బ్రాండ్లపై ఎక్కువ పెంచేలా ప్రపోజల్స్​ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.  మద్యం ధరలను యావరేజ్​గా 20 శాతం నుంచి 25 శాతం మేర  పెంచడం ద్వారా ప్రతినెలా రూ.500  కోట్ల  నుంచి రూ.700  మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.  

 ప్రభుత్వానికి రూ.39వేల కోట్ల మేర ఆదాయం!

ఈ ఆర్థిక సంవత్సరంలో  ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ ద్వారా వ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యూటీల రూపంలో రూ.36 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో ఆబ్కారీ శాఖకు  ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యూటీ ద్వారా రూ.9,493 కోట్లు, వ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా మరో రూ.8,040 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఇప్పటి వరకు ఆ రెండింటి   నుంచి  రూ.17,533 కోట్ల రాబడి వచ్చినట్టు లెక్కలు వెల్లడిస్తున్నాయి. మిగిలిన 6 నెలల్లో ఇదే మొత్తం వస్తుందని అంచనా వేస్తే, ఈ ఆర్థిక సంవత్సరం రూ.35,000 కోట్లకు మించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వాన్ని నిధుల కొరత వెంటాడుతున్నది. దీంతో మద్యం ధరలు పెంచితే.. కొంత ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నది.  వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్​లు, బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, పబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అన్నింటి ద్వారా రోజుకు యావరేజ్​గా రూ.90 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్ముడవుతున్నది. అంటే నెలకు సగటున రూ. 2,700 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లిక్కర్​ రేట్లు పెంచితే  ప్రతి నెలా దాదాపు రూ.700 కోట్ల వరకు అదనంగా రాబడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అనుకున్నట్టు ఆదాయం పెరిగితే ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ నుంచి రూ.38–39  వేల కోట్ల  మేర ప్రభుత్వానికి  రానున్నాయి.