త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్‌కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జూన్ 17న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే తెలంగాణ బక్రీద్ సెలవును మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే నెలవంక దర్శనం ఆధారంగానే బక్రీద్ పండుగ జరుపుకుంటారు. నెలవంక జూన్ 7న కనిపిస్తే.. ఈద్ జూన్ 17న జరుపుకుంటారు.. లేకపోతే 18న బక్రీద్ జరపుుకుంటారు.
బక్రీద్ పండుగ కోసం సిటీలోని అన్ని ఈద్గాలు, మసీదులు ముస్తాబయ్యాయి. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేకలు, గొర్రెలను సిటీకి తీసుకొచ్చారు. మెహిదీపట్నం, లంగర్ హౌస్రింగ్ రోడ్, టోలిచౌకి, జియాగూడ, అంబర్ పేట, కాచిగూడ, చాదర్ ఘాట్, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాల్లో టెంట్లను ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. గతంలో కంటే ఈసారి భారీ సంఖ్యలో మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను మార్కెట్లకు తీసుకొచ్చారు.
ప్రత్యేకంగా ఉన్న మేకలు, పొట్టేళ్లు భారీ ధరకు అమ్ముడవుతాయి. వరంగల్, జనగామ, ఇబ్రహీంపట్నం ఏరియాల నుంచి మేకలు, గొర్రెలను తీసుకొచ్చిన వ్యాపారులు ముషీరాబాద్ లోని ఏక్ మినార్, పఠాన్ బస్తీ, బోలక్ పూర్ ఏరియాల్లో అమ్ముతారు. ఇక్కడ ఒక మేకను రూ.12 వేల నుంచి 20 వేల మధ్యలో అమ్ముతారు.
బక్రీద్‌తో పాటు జూన్ 25 న వచ్చే ఈద్- - ఎ -గదీర్‌కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్‌లో 12వ నెల అయిన దుల్ హిజ్జా 10వ తేదీన బక్రీద్ జరుపుకుంటారు. మసీదులు.. ఈద్గాలలో నమాజ్ చేసిన తర్వాత వేడుకలు ప్రారంభమవుతాయి.