ఆయిల్ పామ్ సాగు రైతులకు ప్రభుత్వం  ప్రోత్సాహం

ఆయిల్ పామ్ సాగు రైతులకు ప్రభుత్వం  ప్రోత్సాహం

హాలియా, వెలుగు: ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను అందిస్తోందని, బిందు సేద్యం సబ్సిడీతో పాటు, మొక్కల కొనుగోలుపై సబ్సిడీ  అందజేస్తుందని పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ నల్గొండ జిల్లా మేనేజర్ కూన్​రెడ్డి మధుసూదన్ రెడ్డిఅన్నారు. బుధవారం నల్గొండ జిల్లా  అనుముల మండలం కుపాస్ పెల్లి గ్రామంలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు పై రైతులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.  

దేశంలో ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధికంగా ఆయిల్ పామ్ సాగు తెలంగాణ లోనె ఉందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఏరియా ఆఫీసర్ బి. సంపత్ కుమార్​,  సిబ్బంది రాజు, కోటేశ్, రైతులు ఐద్దయ్య, నారాయణ, చంద్రయ్య, కరీం  పాల్గొన్నారు.