
కాళేశ్వరం కమిషన్ గడువును మరోసారి పెంచింది ప్రభుత్వం. నెల రోజులు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 30 తో కమిషన్ గడువు ముగియనుండటంతో మే 31 వరకు పెంచింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను తేల్చేందుకు 2024 మార్చిలో సుప్రీంకోర్టు రిటైర్డ్జడ్జి జస్టిస్పీసీ ఘోష్చైర్మన్గా ప్రభుత్వం కమిషన్ఏర్పాటు చేసింది. 100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలనే లక్ష్యంతో మొదటి కమిషన్ ఏర్పాటు చేశారు. తర్వాత ఆయా కారణాల వల్ల కమిషన్ గడువును పలు సార్లు పెంచగా.. లేటెస్ట్ గా మళ్లీ పెంచారు.
కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు కీలక దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 100 మందికి పైగా అధికారులు, నిపుణులను విచారించింది కమిషన్ . 90 శాతం విచారణ పూర్తయినట్లు తెలుస్తోంది. దాదాపు 400 పేజీలకు పైగా నివేదిక రెడీ చేసినట్లు తెలుస్తోంది కమిషన్. తుది దశ విచారణలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలను కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. తర్వాత ఫైనల్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందించనుంది జస్టిస్ ఘోష్ కమిషన్
►ALSO READ | యూపీలో విశాక ఇండస్ట్రీస్ సందర్శించిన రాహుల్.. ఆటమ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం
మరో వైపు కాళేశ్వరం కమిషన్ కు ఎన్డీఎస్ ఏ రిపోర్ట్ ను ఈఎన్సీ అనిల్ కుమార్ అందించారు. ఎన్డీఎస్ ఏ రిపోర్ట్ గురించి జస్టిస్ ఘోష్ సందించిన ప్రశ్నలకు ఈఎన్సీ అనిల్ కుమార్ సమాధానం చెప్పారు. అనిల్ కుమార్ కాళేశ్వరం ఇంటర్నల్ కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. కాళేశ్వరం లోపాలపై కమిటీ చేసిన టెస్టులు, చర్యలపై జస్టిస్ ఘోష్ ఆరాదీశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన టైంలోనూ ఈఎన్సీ జనరల్ గా అనిల్ కుమార్ ఉన్నారు.