- ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, చేయాల్సిన పనులతో రిపోర్ట్
- దాని ఆధారంగానే ఫండ్స్ విడుదల చేసే ఛాన్స్
- ఇప్పటికే శాఖలవారీగా పెండింగ్ వర్క్స్ ప్రపోజల్స్ రెడీ చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు
- డిండి ప్రాజెక్టు పూర్తిపైనే అనుమానాలు
నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రులు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఈ వారంలోనే మంత్రుల టీమ్ రంగంలోకి దిగనుందని టీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మునుగోడు ఎన్నికల ఇన్ చార్జి మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు మంత్రులు నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆ ర్ చండూరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని, వంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మునుగోడును దత్తత తీసుకొని సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ మాట ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చండూ రు మున్సిపాలిటీని దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించారు.
న్నికల ప్రచారంలో భాగంగామంత్రి జగదీష్ రె డ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రో డ్లు, కమ్యూనిటీ హాల్స్, టెంపుల్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి జగదీష్‌రెడ్డి, నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు సోమవారం సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు, పెండింగ్పనుల గురించి చర్చ వచ్చినట్లు తెలిసింది.
ఆయా హామీలు, పనులను గుర్తించి నివేదిక ఇచ్చే బాధ్యతను సీఎం కేసీఆర్..మంత్రులు జగదీష్ రెడ్డి, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ కు అప్పగించినట్లు సమాచారం. ఈ మేరకు వారంలో రోజుల్లో నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించనున్నట్లు టీఆర్ఎస్ ముఖ్య నేత ఒకరు తెలిపారు.
డిపార్ట్మెంట్ల వారీగా ప్రణాళికలు..
15 రోజుల్లో చండూరు రెవెన్యూ డివిజ న్ ఏర్పాటు చేస్తానన్న సీఎం హామీ మేరకు త్వరలోనే కొత్త డి విజన్ జీవో విడుదల కానున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. చండూరు, మునుగోడు, గట్టుప్పుల్, నాం పల్లి, మర్రిగూడ మండలాలతో ఈ కొత్త డివిజన్ ఏర్పాటు చేయనున్నట్లు భావిస్తున్నారు. దీంతో పాటే చండూరులో వంద పడకల ఆసుపత్రికి సంబంధించిన జీవో కూడా విడుదల అవుతుందంటున్నారు.
ఇక డిపార్ట్మెంట్ల వారీగా ప్రణాళికలు రూపొందించేందుకు సంబంధిత శాఖల మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి మూడు నెలలకోసారి నియో జకవర్గంలో అభివృద్ధి పైన సమీక్ష చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చిన నేప థ్యంలో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, మంత్రుల సమన్వయంతో శాఖల వారీ గా ప్రపోజల్స్ రెడీ చేయాలని సంబంధిత శాఖలకు ఓరల్ ఆర్డర్స్ అందాయి.
పంచాయతీరాజ్, ఆర్ అండ్‌బీ, మెడికల్, ఇరిగేషన్ తదితర డిపా ర్ట మెంట్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న సమస్యల తో పాటు, కొత్తగా చేపట్టాల్సిన అ భివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రపో జల్స్ రెడీ చే సే పనిలో పడ్డారు. రెండు, మూ డు రోజుల్లో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులతో మునుగోడులోనే మీటింగ్ పెట్టి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ నాయకులతో చర్చించి పనుల పైన ప్రపోజల్స్ తయారు చేయనున్నట్లు సమాచారం.
బ్రాహ్మణ వెల్లంలకు ఓకే..?
ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న బ్రహ్మణ వెల్లంల రిజర్వాయర్‌కు ఈసారి మోక్షం లభిస్తుందని భావిస్తున్నారు. రూ.200 కోట్లు కేటాయిస్తే ఎప్పుడో పూర్తయ్యే ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపో యింది. ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో రెండు, మూడు నెలల్లో పనులు కంప్లీట్ చేసి లక్ష మంది జనం సమక్షంలో రిజర్వా యర్ ఓపెన్ చే స్తామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం నార్కట్‌పల్లిలో చెప్పడం విశేషం. ఇది పూర్తియితే మునుగోడు మండలంలోని 11 వేల ఎకరాలకు సాగునీరు, మరికొన్ని గ్రామాలకు తాగునీరు అందే చాన్స్ ఉంది.
డిండి ప్రాజెక్టు పైనే అనుమానాలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పూర్తిపై ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోథల పథకంలో భాగంగా నిర్మిస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు ఏదులాపూర్ నుంచి నీటిని మళ్లించాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది.
కృష్ణా జలాల్లో వాటా తేలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వేసిన కేసు తెగితే తప్ప దీనిపై ముందుకు కదలే పరిస్థితి లేదని ఆఫీసర్లు చెప్తున్నారు. కాగా, ఇక్కడి నుంచి వచ్చే నీటి పైన ఆధారపడి మునుగోడులో శివన్నగూ డెం, కిష్టరాయిపల్లి రిజర్వాయర్లు నిర్మిస్తు న్నారు. ఈ సాకులు చూపి డిండి ప్రాజెక్టు పూర్తిచేయకపోతే మిగిలిన ఎన్ని పనులు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.