గూడూరు, వెలుగు : దేశ ప్రజల సంక్షేమమే బీజేపీ లక్ష్యమని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ చెప్పారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్రలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజనులను ఓటు బ్యాంకుగానే చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకటో తేదీన రావాల్సిన ఉద్యోగుల జీతాలు పదో తేదీ వచ్చినా రావడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదలకు మేలు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో మోతీలాల్, సురేందర్, వెంకన్న, కిరణ్, చంద్రశేఖర్‌రెడ్డి, రాంబాబు, బావుసింగ్ పాల్గొన్నారు.