
- జీహెచ్ఎంసీలో జలమండలి డైరెక్టర్, ఎస్ఈకి చోటు
- మున్సిపాలిటీల్లో కమిషనర్,ఈఈకి అవకాశం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: అమృత్ 2.0 స్కీమ్ కింద జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 మున్సిపాలిటీల్లో చేపట్టే తాగునీటి సరఫరా పనులకు సంబంధించి స్టేట్, సిటీ లెవల్లో చేజ్ మేనేజ్మెంట్ టీమ్ (సీఎంటీ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీలో వాటర్ బోర్డ్ డైరెక్టర్ (ట్రాన్స్ మిషన్), ఎస్ఈ మెంబర్లుగా, పదకొండు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కమిషనర్‌తో పాటు ఈఈ (పబ్లిక్ హెల్త్)లకు మెంబర్లుగా కమిటీలో చోటు కల్పించారు.
వీరిని స్టేట్ నోడల్ ఆఫీసర్లుగా పరిగణిస్తారని ఉత్తర్వుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు. ఈ 11 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్, సూర్యాపేట, మిర్యాలగూడ, సిద్దిపేట, ఆదిలాబాద్ ఉన్నాయి.