డిస్కంల మెడకు చత్తీస్​గఢ్ ఉచ్చు

డిస్కంల మెడకు చత్తీస్​గఢ్ ఉచ్చు
  • రూ.261 కోట్లు చెల్లించాలన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్
  • నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్​కు ఫిర్యాదు
  • రాష్ట్రాన్ని డిఫాల్టర్ జాబితాలో చేరుస్తూ ‘ప్రాప్తీ పోర్టల్’లో నమోదు
  • విద్యుత్ కొనుగోళ్లకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్ఛేంజీల అడ్డగింత
  • హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన సర్కార్
  • డిస్పాచ్ సెంటర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు
  • పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విద్యుత్ సంస్థలకు నోటీసులు
  • రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో తప్పిన ముప్పు

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రమంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంలో హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ప్రమాదం తప్పింది. చత్తీస్​గఢ్ నుంచి విద్యుత్ తెచ్చుకునేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్​తో గత బీఆర్ఎస్ సర్కార్ చేసుకున్న కారిడార్ ఒప్పందం డిస్కంల మెడకు చుట్టుకున్నది. కారిడార్ డీల్​కు సంబంధించిన వ్యవహారంలో డిస్కమ్​లు తమకు రూ.261 కోట్లు బకాయి పడ్డాయని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్​కు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. తెలంగాణను డిఫాల్టర్ జాబితాలో చేరుస్తూ ‘ప్రాప్తీ పోర్టల్’​లో నమోదు చేసింది. పవర్ గ్రిడ్ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ డిస్కంలు విద్యుత్ బిడ్లలో పాల్గొనకుండా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఆంక్షలు విధించింది. బకాయిలు చెల్లించేంత వరకు పవర్ ఎక్స్ఛేంజీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల లావాదేవీలు ఆపాలని నిర్ణయం తీసుకున్నది. గురువారం ఉదయం నుంచి తెలంగాణ డిస్కంలు విద్యుత్ కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్ఛేంజీలు నిలిపివేశాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్​లో మాట్లాడారు. రాష్ట్రంలో కరెంట్ సరఫరాకు అంతరాయం రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వెంటనే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు.

డిఫాల్టర్​గా ప్రకటించడం అన్యాయం: ప్రభుత్వం

సీఎం సూచనలతో డిస్కం, ట్రాన్స్ కో అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తే ప్రమాదముందని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి గురువారం సాయంత్రం విచారణ చేపట్టారు. కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రీ లింక్విష్మెంట్ చార్జీల చెల్లింపు వ్యవహారం సెంట్రల్ ఈఆర్సీ విచారణలో ఉండగా.. ఈలోపు పవర్ గ్రిడ్ వ్యవహరించిన తీరును డిస్కం అధికారులు హైకోర్టుకు వివరించారు. తెలంగాణను డిఫాల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రకటించడం అన్యాయమని, రాష్ట్రంలోవ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా వెంటనే ఆదేశాలు ఇవ్వాలని డిస్కంల తరఫున అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి హైకోర్టును కోరారు. బకాయిల చెల్లింపునకు సంబంధించి ‘ప్రాప్తీ పోర్టల్’ లో పవర్ గ్రిడ్ నమోదు చేసినా.. మరో 75 రోజుల పాటు చెల్లింపులకు గడువు ఉంటుందని వివరించారు. అదేమీ పట్టించుకోకుండా కరెంట్ కొనుగోళ్లపై ఆంక్షలు విధించటం సరికాదని వాదించారు. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున డిప్యూటీ సొలిసిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించాలని పలుమార్లు కోరినా డిస్కంలు స్పందించలేదని వివరించారు. అన్నీ పరిశీలించాకే డీ ఫాల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాబితాలో చేర్చినట్లు తెలిపారు.

అవసరం లేకున్నా అడ్వాన్స్ బుకింగ్

చత్తీస్​గఢ్ నుంచి విద్యుత్​ను తెచ్చుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్)తో కారిడార్ బుక్ చేసుకున్నది. ఈ కారిడార్ వివాదం ఇప్పుడు తెలంగాణ డిస్కంల మెడకు చుట్టుకున్నది. అవసరం లేకున్నా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమాగం చేసి కారిడార్లను ముందుగానే బుక్ చేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం వెయ్యి మెగావాట్ల కారిడార్ బుక్ చేసుకుంటే సరిపోతుండగా.. అనవసరంగా మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అడ్వాన్స్​గా కారిడార్ బుక్ చేసిందని విద్యుత్ రంగ నిపుణులు మొదట్నుంచీ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ డిస్కంలు చత్తీస్​గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మర్వా థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ సరఫరాకు 2015, సెప్టెంబర్ 22న 12 ఏండ్ల కాలానికి బ్యాక్ -టు -బ్యాక్ లాంగ్ టర్మ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

2 వేల మెగావాట్ల కారిడార్​కు ఒప్పందం

చత్తీస్​గఢ్ నుంచి తెలంగాణకు కరెంట్ తెచ్చుకునేందుకు డిస్కంలు పవర్ గ్రిడ్ తో 2వేల మెగావాట్ల సామర్థ్యం ఉండే కారిడార్​లు బుక్ చేశాయి. 25 ఏండ్ల పాటు విద్యుత్ సరఫరా చేసుకునేందుకు పవర్ గ్రిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దరఖాస్తు చేసుకున్నాయి. చత్తీస్​గఢ్ నుంచి ఆశించిన స్థాయిలో విద్యుత్ రాకపోవడంతో డిస్కంలు కారిడార్ విషయంలోనూ వెనుకడుగు వేశాయి. కేవలం వెయ్యి మెగావాట్ల విద్యుత్ కారిడార్ కు సంబంధించిన పీపీఏపై పవర్ గ్రిడ్ ఒప్పందంపై డిస్కంలు సంతకం చేశాయి. కానీ.. పవర్ గ్రిడ్ మాత్రం 2వేల మెగావాట్ల ఒప్పందంపై సంతకం చేయాలని పట్టుబట్టింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పవర్ గ్రిడ్ తో ఆ ఒప్పందం చేసుకున్నట్లు డిస్కంలు చెప్తున్నాయి. అందులో వెయ్యి మెగావాట్ల కారిడార్ 2017, ఏప్రిల్ 1 నుంచి అమలు కావాలి. మిగిలిన వెయ్యి మెగావాట్లు 2018, నవంబర్ నుంచి అందుబాటులోకి రావాలి. కానీ.. చత్తీస్​గఢ్ నుంచి వస్తుందనుకున్న విద్యుత్ రావడం లేదని, అదనంగా తీసుకున్న వెయ్యి మెగావాట్ల కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మినహాయించాలని పవర్ గ్రిడ్ ను డిస్కంలు అభ్యర్థించాయి. కానీ, పవర్ గ్రిడ్ ఇందుకు అంగీకరించలేదు. ఈలోపు రీ లింక్విష్మెంట్ చార్జీలుగా రూ.261 కోట్లు తమకు చెల్లించాలని పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రిడ్ పిటిషన్ వేసింది. ఈ విషయంలో తెలంగాణ డిస్కంలు సెంట్రల్ ఈఆర్సీని ఆశ్రయించాయి. అక్కడ విచారణ కొనసాగుతున్నది.

తెలంగాణను డిఫాల్టర్​గా పేర్కొనడం సరికాదు: హైకోర్టు

ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి.. బకాయిల వివాదం కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి వద్ద పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండగా తెలంగాణను డిఫాల్టర్​గా పేర్కొనడం సరికాదన్నారు. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాసిన లేఖను సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ, విద్యుత్ కొనుగోలుకు డిస్కంలకు అనుమతించాలని ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. కారిడార్ చార్జీలు, బకాయిల విషయంలో సెంట్రల్ ఈఆర్సీలో ఉన్న కేసు విచారణ పూర్తయ్యేంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని పవర్ గ్రిడ్ కు సూచించారు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ గ్రిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా, పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్, సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యుటిలిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా లిమిటెడ్, పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా, ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్, కేంద్ర విద్యుత్ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేసింది.