నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 14,236 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 14,236 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మహిళ శిశు సంక్షేమ శాఖలో 14,236 పోస్టులను భర్తీ చేయనుంది. 6399 అంగన్వాడీ, 7837 హెల్పర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ సంబంధిత శాఖ మంత్రి సీతక్క ఫైల్‎పై సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటీఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

ALSO READ | కులగణన నూటికి నూరు శాతం పక్కా.. బలహీన వర్గాలకు ఇదే భగవద్గీత,బైబిల్, ఖురాన్ : సీఎం రేవంత్

ఎలక్షన్ కోడ్ ముగియగానే జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ ద్వారా ఒకేసారి 14,236 ఉద్యోగాలు భర్తీ చేయడంపై మంత్రి సీతక్క స్పందించారు. మహిళ శిశు సంక్షేమ శాఖలో ఒకేసారి 14 వేల పై చిలుకు ఉద్యోగాల భర్తీ చేపట్టడం ఇదే తొలిసారి అని అన్నారు. తాజా పోస్టుల భర్తీతో అంగన్వాడీలు మరింత పటిష్టంగా పని చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.