‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందానికి, థియేటర్ యజమానులకు తెలంగాణ ప్రభుత్వం కలిసొచ్చే వార్త చెప్పింది. ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ థియేటర్లలో మొదటి మూడు రోజులకు రూ. 50, తర్వాత వారం రోజులకు 30 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించింది. అదేవిధంగా మల్టీప్లెక్స్ థియేటర్స్, ఐమాక్స్ థియేటర్లలో మొదటి మూడు రోజులకు రూ. 100, తర్వాత వారం రోజులకు రూ. 50 పెంచుకునే అవకాశం ఇచ్చింది. దాంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ. 236, మల్టీప్లెక్స్‌లో రూ. 413గా టికెట్ రేట్లు ఉండనున్నాయి.
అంతేకాకుండా మార్చి 25న విడుదలకాబోతున్న ఈ సినిమాను 10 రోజుల పాటు రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది. అందులో భాగంగా ఉదయం 7 నుంచి రాత్రి ఒంటి గంట వరకు షోలు వేసుకోవచ్చని థియేటర్ యాజమానులకు చెప్పింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా.. రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజమౌళీ దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
For More News..
పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్