అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
ఎంతో చరిత్ర కలిగిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం కనుమరైంది. ప్రజలు, అర్జీదారుల సమస్యలకు పరిష్కార వేదికగా కొనసాగిన ఆఫీసులు పూర్తిగా నేల మట్టం కావడంతో ఒకప్పడు భవనాలతో కళకళలాడిన ఆ ప్రాంతం ఇప్పుడు మైదానంలా మారి బోసిపోతుంది. - వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా జరుపుకున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసు వద్ద డీసీసీ ప్రెసిడెంట్కైలాస్ శ్రీనివాస్‌రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ, తెలంగాణలో కేసీఆర్ సర్కారు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రెటరీ వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ మోహన్‌రెడ్డి, లీడర్లు నహీం, చంద్రకాంత్‌రెడ్డి, పండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ
ఆర్మూర్ : ఆర్మూర్ టౌన్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డీసీసీ ప్రధాన కార్యదర్శి మీర్ మాజీద్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు కోలా వెంకటేశ్, అజ్జు, మందుల పోశెట్టి, జిమ్మి రవి, హబీబ్, బాలకిషన్, మెహబూబ్, పెద్ద పోశెట్టి, ఉస్మాన్, నరేశ్, పాషా, అఖిల్, సూర్య రోహన్, అఫ్రోజ్ పాల్గొన్నారు.
మద్దతు ధర గ్యారంటీ చట్టాన్ని తేవాలి
సిరికొండ, వెలుగు: స్వామినాథన్ కమిషన్ సిఫారస్ ప్రకారం మద్దతు ధర గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని ఏఐపీకేఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉప తహసీల్దార్ ప్రవీణ్‌కు మెమోరాండం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోక ఒకరినొకరు విమర్శలతోనే కాలం గడుపుతున్నారని ఆరోపించారు. రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లు నిండిన ప్రతీ రైతుకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బాబన్న, రమేశ్, సాయారెడ్డి, లింబాద్రి, అనిశ్ కిశోర్, రాములు, గంగారాం పాల్గొన్నారు.
కామారెడ్డి కమిషనర్‌కు 558 నోటీసులు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి కొత్త మాస్టర్‌ప్లాన్‌లో ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్, విలీన గ్రామాల శివారుల్లో నుంచి 100 ఫీట్ల రోడ్ల ప్రతిపాదనలతో నష్టపోతున్న 558 మంది రైతులు ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారు. మరో వైపు వీరి తరఫున మున్సిపల్ కమిషనర్‌కు బుధవారం 558 నోటీసులు పంపారు. కలెక్టర్‌కు కూడా ఈ నోటీసులు పంపనున్నారు.
విద్యకు సర్కారు పెద్దపీట : ఎమ్మెల్యే జాజాల సురేందర్
లింగంపేట, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, రాష్ట్రంలో ఒకప్పుడు 74 మైనార్టీ గురుకుల పాఠశాలలు ఉండగా నేడు వాటి సంఖ్య 204కు పెరిగిందని ఎమ్మెల్యే జాజాల సురేందర్ చెప్పారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకులాన్ని బుధవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీ గురుకులాల్లో చదివే స్టూడెంట్లకు ఒక్కొక్కరికి ఏడాదికి లక్షకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. స్టూడెంట్లు పట్టుదలతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ గురుకులాల స్టూడెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులను కల్పిస్తుందని, స్టూడెంట్లు బాగా చదివి జీవితంలో స్థిరపడాలని సూచించారు. కార్యక్రమంలో లింగంపేట సర్పంచ్ బొల్లు లావణ్య, ఎంపీపీ గరీబున్నీసా, ఎంపీటీసీ షమీమున్నీసా, మైనార్టీ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ అబ్దుల్‌బషీర్, నోడల్ ఆఫీసర్ షేక్ సలాం, ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీనునాయక్, కాలేజీ ప్రిన్సిపాల్ వెంకట్‌రావములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్, ప్రధాన కార్యదర్శి అట్టెం శ్రీనివాస్, లీడర్లు సిద్దారెడ్డి, నరహరి, నయీం తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి
నిజామాబాద్‌రూరల్, వెలుగు: బీఆర్ఎస్ బలోపేతం కోసం కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మధుకర్ సూచించారు. బుధవారం మండలంలోని మల్లారం, మల్కాపూర్(టి) గ్రామాల్లో బూత్ కమిటీ ప్రతినిధులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకుల్లో విభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలని, పార్టీని బలోపేతం చేసే విషయంలో అందరు కలిసి పని చేయాలని కోరారు. అయితే మల్కాపూర్(టి)లో డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించే విషయంలో స్థానిక నాయకుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో ఎంపీపీ అనూష, జడ్పీటీసీ సుమలత, సర్పంచ్ గంగారాంనాయక్, నాయకులు గోపాల్‌నాయక్, ప్రకాశ్, వసంత్‌రావు, ప్రేమ్‌దాస్ పాల్గొన్నారు.
బహుజన రాజ్యం కోసం ఉద్యమించాలి
ఆర్మూర్, వెలుగు: బహుజన రాజ్యం కోసం బీసీలు ఉద్యమించాలని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ పిలుపునిచ్చారు. ఆర్మూర్‌లో బుధవారం జరిగిన బీఎల్ఎఫ్ నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీసీల అభివృద్ధికి బడ్జెట్‌లో నయాపైసా కేటాయించలేదన్నారు. బహుజనులు రాజ్యాధికారంలోకి వస్తేనే గిరిజనులు, మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు అవుతాయన్నారు. పేదలకు భూ పంపిణీ, సొంత ఇంటి కల సాకారం కావాలంటే బీసీల నాయకత్వంలోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో బీఎల్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, ఆర్మూర్ కన్వీనర్ దండు జ్యోతి, కోకన్వీనర్లు ద్యారంగుల రాజు, బోదాస్ నర్సయ్య, ఆర్మూర్, రూరల్ మండల కన్వీనర్లు విజయ్, నాయకులు లావణ్య, శ్యామల, బి.శ్రీనివాస్, శివరాత్రి హన్మంతు, రాందాస్, నవీన్ పాల్గొన్నారు.
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
ఎర్గట్ల, వెలుగు: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్ ఏసీడీపీవో జ్ఞానేశ్వరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్భా స్కూల్‌లో స్టూడెంట్లకు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏండ్లు నిండకుండా వివాహం జరిపించకూడదని, అలా చేస్తే చట్టరీత్యా నేరమన్నారు. బాల్య వివాహాల వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లేరన్నారు. గర్భస్రావాలు జరగడం లేదా అంగ వైకల్యం గల పిల్లలు పుడతారని చెప్పారు. బాల్య వివాహాలు చేస్తే తల్లిదండ్రులతో పాటు ప్రోత్సహించిన వారికి కూడా రెండేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్, అంగన్వాడీ టీచర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.