- 14 మంది ఐఏఎస్‌లకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో 14 మందికి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఐఏఎస్‌లుగా పదోన్నతి దక్కింది. సీఎం సెక్రటరీగా ఉన్న 1999 బ్యాచ్‌కు చెందిన శేషాద్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఎనర్జీ సెక్రటరీగా ఉన్న రిజ్వీకి ప్రిన్సిపల్సెక్రటరీ పదోన్నతి లభించింది.
ఇక జూనియర్ అడ్మినిస్ర్టేటివ్ గ్రేడ్ పదోన్నతులు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ప్రమోషన్ పొందినవారిలో 2015కు చెందిన ఐఏఎస్‌లు పమేలా సత్పతి, అనురాగ్ జయంతి, గౌతమ్ పాత్రు, రాహుల్ రాజ్, భావేష్ మిశ్రా, సత్య శారదాదేవి, నారాయణ రెడ్డి, ఎస్. హరీశ్, జి. రవి, కె.నిఖిల, అయేషా మష్రత్ ఖానమ్, సంగీత సత్యనారాయణ, యాసీన్ బాషా, వెంకట్రావ్ ఉన్నారు.