
- నాన్లేఅవుట్ప్లాట్ల రెగ్యులేషన్‌కు గవర్నమెంట్ గ్రీన్‌సిగ్నల్
- దరఖాస్తుదారుల నాలుగేండ్ల నిరీక్షణకు కదలిక
- ఉమ్మడి జిల్లాలో 1,91,499 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు
- రూ.19.14 కోట్ల ఫీజు రాబట్టుకొని గాలికొదిలేసిన గత బీఆర్ఎస్ సర్కారు
- కాంగ్రెస్ పాలనలో పరిష్కారం దిశగా అడుగులు
ఉమ్మడి జిల్లాలో ఎల్ఆర్ఎస్దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించనుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంతో నాలుగేండ్ల నుంచి పెండింగ్ లో ఉన్న అంశంపై కదలిక వచ్చింది. రెవెన్యూ ఆఫీసర్ల భాగస్వామ్యంతో స్పెషల్ టీంల ఏర్పాటుకు యంత్రాంగం రెడీ అవుతోంది. వీలైనంత స్పీడ్‌గా పల్లె, పట్టణాల్లోని నాన్‌లేఅవుట్ ప్లాట్ల రెగ్యులరైజ్ చేయనుంది
నిజామాబాద్, వెలుగు : ఎల్ఆర్ఎస్పేరుతో నాన్లేఅవుట్ఇంటి స్థలాలు క్రమబద్ధీకరణ చేసుకోవాలని గత బీఆర్ఎస్గవర్నమెంట్ ప్రజలకు సూచించగా, ఇందూర్మున్సిపల్కార్పొరేషన్పరిధిలో 33,758 దరఖాస్తులు అందాయి. నుడా కింద ఉన్న 74 గ్రామ పంచాయతీల నుంచి 5,914 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. బోధన్, ఆర్మూర్, భీంగల్మున్సిపాలిటీలు కలిపి మొత్తం 57,311 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల నుంచి మరో 20,459 అర్జీలు పెట్టుకున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజుగా కొందరి నుంచి రూ.వెయ్యి, మరికొందరి నుంచి రూ.10 వేలు అప్పటి సర్కారు తీసుకోగా, రూ.7.77 కోట్ల ఆదాయం సమకూరింది.
ఫీజులు తీసుకొని పక్కన పెట్టేశారు..!
ఈ దరఖాస్తులతో పాటు ఎల్ఆర్ఎస్ను గ్రామ పంచాయతీలకు విస్తరించగా, నిజామాబాద్ జిల్లాలోని 530 పంచాయతీల నుంచి 79,150, కామారెడ్డి జిల్లాలోని 526 జీపీల నుంచి 34,579 అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా వచ్చారు.. ఫీజు రూపంలో రూ.11.37 కోట్ల ఆదాయం లభించింది. 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలల్లో ఉమ్మడి జిల్లా నుంచి 1,91,499 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లతో అక్షరాల రూ.19.14 కోట్ల నగదు బీఆర్ఎస్ గవర్నమెంట్‌కు వెళ్లింది. ఆ తర్వాత ప్రభుత్వం ఈ సంగతి పట్టించుకోలేదు. లేఅవుట్ కాని ఇంటి ప్లాట్స్ కొని రెగ్యులైజేషన్కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది పరిస్థితి అగమ్యంగా మారింది. దీని ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపైనా దీని ఎఫ్టెక్ట్ పడింది.
మొదటి నుంచి వ్యతిరేకించిన కాంగ్రెస్
ఎల్ఆర్ఎస్ను కాంగ్రెస్‌పార్టీ మొదటి నుంచి వ్యతిరేకించింది. అధికారంలోకి వచ్చాక ఈ ఇష్యూపై ఫోకస్ చేసి మార్చి నెలలోనే పాజిటివ్ సాంకేతాలు ఇచ్చింది. పార్లమెంట్ఎలక్షన్స్అడ్డంకితో ఆగిన ప్లాట్స్ రెగ్యులేషన్‌కు ఇప్పుడు గ్రీన్సిగ్నల్ఇచ్చేసింది. వీలైనంత స్పీడ్‌గా ఎల్ఆర్ఎస్సెటిల్ చేయాలని డిసైడైంది. ఇందుకోసం జిల్లా లెవల్లో అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) పర్యవేక్షణలో టీం ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టింది. రెవెన్యూతో పాటు ఇతర శాఖ సిబ్బందిని డిప్యూట్ చేసి కోర్టు వివాదాలు, గవర్నమెంట్ ల్యాండ్‌తో సంబంధంలేని ఇంటి జాగాలను క్రమబద్ధీకరణ చేయనుంది.