తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ట్రై సిటీల అభివృద్ధికి రూ. 4962కోట్లు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ట్రై సిటీల అభివృద్ధికి  రూ. 4962కోట్లు

ప్రజా పాలనకు  ఏడాది పూర్తయిన సందర్భంగా  తెలంగాణ ప్రభుత్వం ప్రజా విజయోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో   హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరంగల్ మహా నగరం అభివృద్దికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 4962.47 కోట్లు కేటాయించింది. సీఎం రేవంత్ రెడ్డి  ఆదేశాలతో పలు విభాగాల పరిధిలో నగరంలో చేపట్టే పనులకు ఈ నిధులు మంజూరు చేసింది. విజయోత్సవంలో భాగంగా కొన్ని పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ వరుసగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం

వరంగల్ కు మంజూరు చేసిన నిధులు

  • వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి  రూ.4,170 కోట్లు 
  • మామునూరు ఎయిర్ పోర్ట్ భూసేకరణకు రూ. 205 కోట్లు 
  • కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు రూ. 160.92 కోట్లు 
  • టెక్స్ టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాలకు రూ. 33.60 కోట్లు 
  •  టెక్స్ టైల్ పార్క్ కు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇండ్లకు రూ. 43.15 కోట్లు 
  •  కాళోజీ కళాక్షేత్రానికి  రూ.85 కోట్లు
  •  పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణకు రూ. 65 కోట్లు 
  •  నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.8.3 కోట్లు 
  •  వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కు రూ. 32.50 కోట్లు 
  •  ఇన్నర్ రింగ్ రోడ్ కు  రూ.80 కోట్లు
  •  భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజీ న్యూ బిల్డింగ్ కు రూ.28 కోట్లు 
  •  గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లకు రూ. 49.50
  •  వరంగల్ ఉర్దూ భవన్, షాదీ ఖానా కు రూ. 1.50 కోట్లు