తెలంగాణ ప్రభుత్వం 2024 కు గానూ ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. 41 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించింది. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా బెస్ట్ టీచర్స్ అవార్డ్ అందుకోబోయే ఉపాధ్యాయులు..అధ్యాపకుల పేర్లను ప్రకటించింది విద్యా శాఖ.
సెప్టెంబర్ 5న సాయంత్రం రవీంద్ర భారతిలో 41 మంది ఉపాధ్యాయులు బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ అందుకొనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ బెస్ట్ టీచర్స్ అవార్డులు అందుకోనున్నారు ఉపాధ్యాయులు.