పత్తిపాక నిర్మాణానికి సర్కార్​ ఓకే .. డీపీఆర్‌‌‌‌‌‌‌‌ సిద్ధం చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు

పత్తిపాక నిర్మాణానికి సర్కార్​ ఓకే  .. డీపీఆర్‌‌‌‌‌‌‌‌ సిద్ధం చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు
  • ఇప్పటికే నిర్మాణ స్థల పరిశీలించిన జిల్లా ప్రజాప్రతినిధులు 
  • 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నిర్మించాలన్న యోచనలో సర్కార్‌‌‌‌‌‌‌‌ 
  • ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌పీ ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్త ఆయకట్టు పెరిగే చాన్స్‌‌‌‌ 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి సర్కార్‌‌‌‌‌‌‌‌ నిర్ణయించింది. ఇప్పటికే మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు, విప్‌‌‌‌ అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఎంఎస్‌‌‌‌ రాజ్‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. డీపీఆర్‌‌‌‌‌‌‌‌ రెడీ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆఫీసర్లను ఆదేశించారు. 

ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ పూర్తయితే ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌పీ ఆయకట్టు 2.40లక్షల ఎకరాలతోపాటు మరో 10 నుంచి 20 వేల వరకు కొత్త ఆయకట్టుకు నీరందనుంది. కాగా ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలన్న యోచనలో సర్కార్‌‌‌‌‌‌‌‌ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో పెద్దపల్లి జిల్లారైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతిపాదనల దశలోనే ఆగింది 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, ధర్మపురి, మంథని, చొప్పదండి, జగిత్యాల నియోజకవర్గాల్లోని ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌పీ ఆయకట్టును స్థిరీకరించాలన్న ఉద్దేశంతో గత సర్కార్‌‌‌‌‌‌‌‌ పత్తిపాక వద్ద రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నిర్మించాలని ప్లాన్‌‌‌‌ చేసింది. ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ 1.5 టీఎంసీలు, 5 టీఎంసీలు, 7టీఎంసీలుగా నిర్మించాలని ఆలోచన చేశారు. కానీ ఈ ప్రతిపాదనలు ఏ ఒక్కటీ ఫైనల్ చేయలేదు. దీంతో ఆ ప్రాజెక్ట్‌‌‌‌ మూలనపడింది. దీంతో ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్పీ టేల్‌‌‌‌ ఎండ్‌‌‌‌ రైతులకు నీరందని పరిస్థితి నెలకొంది. 

 టేల్‌‌‌‌ ఎండ్‌‌‌‌ రైతులకు సాగునీరు 

ఉమ్మడి జిల్లాలోని ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌పీ ఆయకట్టు కింద సాగునీరు అందుతున్నా టేల్‌‌‌‌ ఎండ్‌‌‌‌ రైతులకు దశాబ్దాలుగా పంటలకు అందని పరిస్థితి. ముఖ్యంగా చివరి దశలో నీరందక పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తయితే పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, రామగిరి, మంథని, రామగుండం మండలాలతోపాటు కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా చొప్పదండి, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌‌‌‌‌‌‌‌ మండలాల్లోని టేల్‌‌‌‌ఎండ్‌‌‌‌ రైతులకు సాగునీరు అందించొచ్చు. 

ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ ప్రాముఖ్యతను గుర్తించిన కాంగ్రెస్ లీడర్లు.. తాము అధికారంలోకి వస్తే పత్తిపాక వద్ద రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తామని అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌‌‌‌ సర్కార్ ఏర్పడిన నేపథ్యంలో ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నిర్మాణంపై జిల్లా ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టారు. ఇటీవల మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు నేతృత్వంలో స్థానిక ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు మక్కాన్‌‌‌‌సింగ్‌‌‌‌, విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌.. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలిసి క్లియరెన్స్ తీసుకున్నారు. అనంతరం అధికారులతో కలిసి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించారు. డీపీఆర్‌‌‌‌‌‌‌‌ రెడీ చేయాలని ఆఫీసర్లను ఇరిగేషన్ మంత్రి ఆదేశించారు.