
హైదరాబాద్, వెలుగు: మహర్షి వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జీఏడీ సెక్రటరీ రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం వాల్మీకి జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి అవసరమైన బడ్జెట్ను బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ నిధుల నుంచి ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.