స్క్రాప్ నుంచి కరెంట్​ ఉత్పత్తి .. హుజూరాబాద్ మూడో ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం

స్క్రాప్ నుంచి కరెంట్​ ఉత్పత్తి .. హుజూరాబాద్ మూడో ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం
  •  హుజూరాబాద్ సమీపంలో 6 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు
  •  25 ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
  •  ప్లాంట్​ నిర్మాణం కోసం రూ.150కోట్లు మంజూరు 
  •  ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోనే మూడోది

కరీంనగర్, వెలుగు: మున్సిపాలిటీల పరిధిలో పోగవుతున్న చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసేందుకు మున్సిపల్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివారులో జవహర్ నగర్, దుండిగల్ లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. హుజూరాబాద్ సమీపంలో మూడో ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 6 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయబోయే ఈ ప్లాంట్ కోసం 25 ఎకరాలు కేటాయించింది. ప్లాంట్ నిర్మాణం కోసం రూ.150 కోట్లు మంజూరు చేసింది. టెండర్ ప్రకియ పూర్తయితే త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
 
రెండు కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీల నుంచి చెత్త సేకరణ

6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రోజుకు సుమారు 790 టన్నుల చెత్త అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ప్రతి రోజు సమీపంలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీల నుంచి చెత్త తరలించనున్నారు. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 518.62 టన్నులు, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్ నుంచి 186.07 టన్నులు, హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 19.74 టన్నులు, జమ్మికుంట నుంచి 18.64 టన్నులు, కొత్తపల్లి నుంచి 4.67 టన్నులు, హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 9.32 టన్నులు తరలించనున్నారు.

Also Read :- నిర్మల్ జిల్లాలో విస్తరిస్తున్న ఫైలేరియా

 అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నుంచి 15.64 టన్నులు, పరకాల నుంచి 10.32 టన్నులు,  వర్ధన్నపేట నుంచి 5.79 టన్నుల చెత్తను ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించనున్నారు. దీంతో ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డంపింగ్ సమస్య తీరడంతోపాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆదాయం సమకూరనుంది. 

విద్యుత్ ఉత్పత్తి ఇలా..     

ఇంటింటా సేకరించిన చెత్తను హుజూరాబాద్ తరలిస్తారు. అక్కడే మండే గుణం కలిగిన వ్యర్థాలను సెగిగ్రేట్ చేస్తారు. వాటిని గార్బేజీ పిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వారం పాటు ఆరబెట్టాక వాటి నుంచి విడుదలయ్యే మీథేన్, ఇతర వాయువులను ఫ్యాన్ల ద్వారా బర్నింగ్ చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుసంధానిస్తారు. చెత్తను క్రేన్లతో బర్నింగ్ బాయిలర్ లో వేసి మండిస్తారు. దీంతో ఏర్పడిన నీటి ఆవిరితో టర్బయిన్లు తిరిగేలా చేసి కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి చేస్తారు.

 సాధారణంగా ఇలాంటి వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లలో రోజుకు వందల టన్నుల చెత్తను మండించినా అందులో నుంచి వచ్చే పొగ, బూడిద ప్లాంట్ దాటి వెళ్లే పరిస్థితి ఉండదు. ఎలాంటి వాయు కాలుష్యం ఉండదు. బాయిలర్ అడుగున పడే బూడిదను, బ్లోయర్ల ద్వారా వచ్చే ఫ్లైయాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నీటితో చల్లబరిచి రోడ్లపై గుంతలు పూడ్చడానికి, ఇటుకల తయారీకి వినియోగించనున్నారు.