సౌలత్​లు కల్పించడంలో ప్రభుత్వం విఫలం

ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకుంటుందని, మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని బీజేపీ లీడర్లు ఆరోపించారు. నగరంలోని ఏఎంసీలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన పత్తి యార్డ్ ను బీజేపీ జిల్లా లీడర్​దేవకి వాసుదేవరావు ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ లీడర్లు సందర్శించారు. ట్రేడర్ చిత్తారు శ్రీనివాసరావును వారు ప్రమాద విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీజేపీ లీడర్లు మాట్లాడుతూ రూ.80 లక్షలు నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని కోరారు. మార్కెట్ సమీపంలో నిర్మించిన ఫైర్ స్టేషన్ ను మార్కెట్ శాఖ ఆఫీస్ గా మార్చుకుందని గుర్తు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తక్షణమే స్పందించి మార్కెట్ లో ఫైర్ ఇంజిన్ ను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జంగిలి రమణ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.