కాల్వల్లో జంగిల్ కటింగ్ .. ప్రాజెక్ట్ ల కింద కాల్వల్లో పిచ్చి మొక్కల తొలగింపు

 కాల్వల్లో జంగిల్ కటింగ్ .. ప్రాజెక్ట్ ల కింద కాల్వల్లో పిచ్చి మొక్కల తొలగింపు
  •  పిచ్చి మొక్కలు, పూడికతీతకు రాష్ట్ర సర్కార్  చర్యలు
  • రూ.1100 కోట్లు కేటాంయించిన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్   
  • చివరి ఆయకట్టు భూముల రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
  • పదేండ్లలో  పట్టించుకోని బీఆర్ఎస్ పాలకులు

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలనలో సాగునీటి కాల్వలను సరిగా పట్టించుకోలేదు. పిచ్చి మొక్కలు, పూడికతో నిండిపోయాయి. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రధాన కాల్వలతో పాటు పిల్ల కాల్వలు కూడా నిరుపయోగంగా మారాయి. రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలనే లక్ష్యంతో నిర్మించిన ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ల ద్వారా సరఫరా చేసే సాగునీళ్లు ఆయకట్టు చివరి భూములకు చేరుకోవట్లేదు. ఏటా రైతులు సాగునీళ్ల కోసం ఇబ్బందులు పడుతూ రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నది చూస్తున్నాం.

క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కాల్వల్లో  పిచ్చిమొక్కల తొలగింపు, పూడికతీతకు నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో భారీ, మధ్య తరహా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ల కింద 20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయా ప్రాజెక్ట్ ల కింద  సాగు చేసే భూములకు సాగునీరందించేందుకు తవ్విన మెయిన్‌‌‌‌‌‌‌‌, మైనర్‌‌‌‌‌‌‌‌ కాల్వల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడంతో   చివరి ఆయకట్టు భూముల రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్ ఉత్తమ్ ప్రకటనతో మంచికాలం రానుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

రూ.1100 కోట్లు కేటాయింపు 

రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ల కింద నిర్మించిన కాలువల్లో పేరుకుపోయిన పూడికతీత, చెట్లు, పిచ్చి మొక్కల తొలగింపుకు రూ.1,100 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ మినిష్టర్‌‌‌‌‌‌‌‌ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఇటీవల ప్రకటించారు
త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలుపెడతామని తెలిపారు. కాల్వల్లో ఎక్కడెక్కడ సమస్యలు న్నాయో వాటిని గుర్తించినట్లు పేర్కొన్నారు.  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలకులు పట్టించుకోకపోవడంతోనే ఆయకట్టు చివరి భూములకు సాగు
నీరందలేదని చెప్పారు.  ప్రస్తుత ప్రభుత్వంలో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ల వారీగా నీళ్లను విడుదల చేసి ఆయకట్టు చివరి పొలాలకు కూడా సాగునీళ్లందిస్తామని మంత్రి స్పష్టంచేశారు.

 “భూపాలపల్లి జిల్లాలోని రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరందించే ఎస్సారెస్పీ డీబీఎం – 38 కాలువ ఇది. కొన్నేండ్లుగా పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఏడాదికోసారి ఎస్సారెస్పీ నీళ్లు వదిలినా కాలువలోని పిచ్చి మొక్కల కారణంగా ఆయకట్టు చివరి భూములకు నీళ్లు అందడం లేదు. దీంతో రైతులు సాగునీరందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.’’

 “హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహారాపూర్‌‌‌‌‌‌‌‌, గోవిందాపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామాల సమీపంలోని ఎస్పారెస్పీ కాలువ ఇది. కెనాల్‌‌‌‌‌‌‌‌ ఆనవాళ్లు కూడా కనిపించలేనంతగా చెట్లు పెరిగాయి. పక్కన ఉన్న రోడ్డు కూడా ముళ్ల పొదల మాటున కనిపించడం లేదు. ఎస్సారెస్పీ నీళ్లు వదిలిదే కేవలం మైలారం వరకు మాత్రమే వస్తున్నాయి. ఆ తర్వాత నీళ్లు కిందికి రావట్లేదు. దీంతో సుమారు ఐదారు గ్రామాల్లో వెయ్యి ఎకరాలకుపైగా సాగు భూములకు నీళ్లందని
పరిస్థితి ఉంది.’’

పూడికతీస్తే చెరువులు నిండుతయ్ 

ఎస్సారెస్పీ కాల్వల్లో చాలా ఏండ్లుగా పూడికతీయడం లేదు. పిచ్చి మొక్కలు పెరిగిపోయి.. చెత్తా చెదారంతో నిండిపోవడంతో కాల్వలో నీళ్లు వదిలినా ఆయకట్టు చివరి పంటపొలాలకు అందడం లేదు. చెరువులు కూడా నిండట్లేదు. ఈసారి కాల్వలను మరమ్మతులు చేసి, పూడికమట్టి తొలగిస్తే, రైతులకు ఎంతో  ఉపయోగంగా ఉంటుంది.  

దొడ్ల కోటేశ్వర్‌‌‌‌‌‌‌‌, గర్మిళ్లపల్లి రైతు, టేకుమట్ల మండలం, భూపాలపల్లి జిల్లా