జీహెచ్ఎంసీలోనూ హైడ్రాకు అధికారాలు..

జీహెచ్ఎంసీలోనూ  హైడ్రాకు అధికారాలు..
  • గ్రేటర్​ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే పవర్
  • ఇకపై హైడ్రా నుంచే నోటీసులు
  • ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ
  • జీహెచ్ఎంసీ చట్టంలో మార్పులు
  • ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రభుత్వం మరిన్ని అధికారాలను కల్పించింది. ఇక నుంచి గ్రేటర్​ హైదరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​( జీహెచ్ఎంసీ) పరిధిలోని అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపించే అవకాశాన్ని హైడ్రాకు కట్టబెట్టింది. ఈ మేరకు జీహెచ్ ఎంసీ అధికారాలను హైడ్రాకు బదిలీ చేస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

 ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు డిజాస్టర్స్ అసెట్స్ ప్రొటెక్షన్ లో హైడ్రాకు అధికారాలు ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ చట్టంలో ప్రత్యేక సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(374-బీ)ను చేర్చింది. ఈ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అంశాలను ఆర్డినెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పొందుపరిచిన ప్రభుత్వం.. దాని ఆమోదం కోసం గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపింది. ఆ ఆర్డినెన్స్ ను గత నెల 30న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ  ఆమోదం తెలిపి మున్సిపల్ శాఖకు పంపారు.

 ఈ ఆర్డినెన్స్ కు తగ్గట్టుగా బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇప్పటి నుంచి హైడ్రా చేపట్టబోయే అన్ని పనులకు చట్టబద్ధత లభించనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. 

హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగిస్తూ..

 తెలంగాణ కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (టీసీయూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు హైడ్రాకు ప్రస్తుతం ఎదురవుతున్న కొన్ని ఆటంకాలను తొలగిస్తూ, దానికి విశేష అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపొందించారు. హైడ్రాకు బదలాయించిన అధికారాలను వివరిస్తూ జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ చట్టం1955లో ప్రత్యేకంగా 94-బీ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేరుస్తున్నారు.

 ఈ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రంలోని ఒక కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్లు, డ్రెయిన్లు, వీధులు, నీటి వనరులు, ఖాళీ స్థలాలు, పార్కులు, ఇతర ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా వాటిని పరిరక్షించడానికి అవసరమైన అన్ని అధికారాలను హైడ్రాకు బదిలీ చేన్తూ ఆయా అంశాలను పొందుపరిచారు. 

ఔటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం అధికారాలను అమలు చేయడానికి, బదలాయించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుందని సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు.  

జీహెచ్ఎంసీ చట్ట సవరణతో హైడ్రాకు పూర్తిస్థాయి అధికారాలు: రంగనాథ్

హైడ్రా ఆర్డినెన్సు ప్రకారం హైడ్రాకు పూర్తి అధికారాలు కట్టబెడుతూ బుధవారం ఏఎంయూడీ విడుదల చేసిన జీవో 199పై  బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణతో హైడ్రాకు పూర్తి స్థాయి అధికారాలు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఇకపై హైడ్రా నోటిసులు జారీ చేస్తుందన్నారు.