హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ తీసుకున్నవారిని నిమిషాల్లో కనిపెట్టేందుకు స్పెషల్ కిట్స్ ను అందుబాటులోకి తెచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్ టెస్టులు చేయనున్నారు. వీకెండ్ లో టీఎస్ న్యాబ్, పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. డ్రగ్స్ సేవించినవారి రిపోర్టు నిమిషాల్లో రానుంది. ఇటీవల నగరంలో డ్రగ్స్ వినియోగం పెరిగింది. దీంతో డ్రగ్స్ ను అరికట్టేందుకు స్పెషల్ ఫోకస్ చేశారు పోలీసులు.
నగరానికి డ్రగ్స్ సరఫరాపై నిఘా ఉంచారు. ఫాంహౌస్ లు, రేవ్ పార్టీలు, పబ్, స్టార్ హోటళ్లలో తరుచూ తనిఖీలు చేస్తున్నారు. స్నిపర్ డాగ్స్ తో వీకెండ్ లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు చేశారు.