Hyderabad: డీజేలు, ఫైర్ క్రాకర్స్ బ్యాన్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఐదేళ్లు జైలు

Hyderabad: డీజేలు, ఫైర్ క్రాకర్స్ బ్యాన్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఐదేళ్లు జైలు

హైదరాబాద్ లో డీజేలు అండ్ ఫైర్ క్రాకర్స్ పై  నిషేదం విధించింది ప్రభుత్వం.   శబ్ద కాలుష్యం వల్ల డీజేను నిషేధిస్తున్నట్లు హైదరాబాద్  సీపీ సీవీ ఆనంద్  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.   హైదరాబాద్ డయల్ 100 కు ఫిర్యాదులు రావటంతో నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు , అన్ని మత పెద్దలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు.

డీజే, సౌండ్ మిక్సర్, హై సౌండ్ ఎక్యూప్ మెంట్ పరికరాలపై నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు సీపీ ఆనంద్ తెలిపారు. రాత్రి 10  గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు పూర్తి నిషేధం విధించినట్లు తెలిపారు. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో అనుమతి ఇచ్చారు.  రెసిడెన్షియల్ జోన్ లో 55 డిసిబల్స్, కమర్షియల్ జోన్ లో 65 డిసిబల్స్ కి మించితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ALSO READ | Bathukamma Special : ఇది మగవాళ్ల బతుకమ్మ.. ఈ ఒక్క ఊరిలోనే ఇలా..!

ఆసుపత్రులు , స్కూళ్లు,  కాలేజీలు,  కోర్టు ప్రాంగణాలకు 100 మీటర్ల దూరంలో  నిషేధాజ్ఞలు విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు  జరిమానా పడే అవకాశం ఉందన్నారు సీపీ.