తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ORR పరిధిలోని 51 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం

 తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ORR పరిధిలోని  51 గ్రామాలు  మున్సిపాలిటీల్లో  విలీనం

గ్రేటర్ హైదరాబాద్ ను మరింత విస్తరించింది  తెలంగాణ ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న51 గ్రామాలను దగ్గర్లోని మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజిట్ జారీ చేసింది. ఈ ఊర్లలో పంచాయతీ ఎన్నికలను నిలిపివేసింది. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


ప్రభుత్వ నిర్ణయంతో ఓఆర్ఆర్ఆర్ పరిధిలోని ప్రభుత్వ నిర్ణయంతో  మేడ్చల్ మల్కాజ్ గిరి,రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని 51  గ్రామ పంచాయితీలు మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి.  

ALSO READ : తెలంగాణలో కొత్త విద్యా కమిషన్.. ఉత్తర్వులు జారీ

మేడ్చల్ మున్సిపాలిటీ,  దమ్మాయిగూడ మున్సిపాలిటీ, పోచారం మున్సిపాలిటీ, ఘట్కేసర్ మున్సిపాలిటీ, గుండ్లపోచంపల్లి ,అమీన్ పూర్ మున్సిపాలిటీ, తెల్లాపూర్ మున్సిపాలిటీ.  పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ. కుత్బుల్లాపూర్, నాగారం, తూంకుంట మున్సిపాలిటీ, తుక్కుగూడ, నార్సింగి, శంషాబాద్ మున్సిపాలిటీల్లో ఈ  51 గ్రామాలు విలీనం కానున్నాయి.