- కాంట్రాక్ట్ బేసిస్‌లో భర్తీ
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో 842 యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 421 పోస్టులను మేల్ అభ్యర్థులతో, మరో 421 పోస్టులను ఫీమేల్ అభ్యర్థులను కాంట్రాక్ట్ బేసిస్ లో భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. మేల్ యోగా ఇన్స్ట్రక్టర్లు నెలకు కనీసం 32 యోగా సెషన్లకు అటెండ్ కావాలని, ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్లు నెలకు కనీసం 20 యోగా సెషన్లకు అటెండ్ కావాలని పేర్కొన్నారు. ప్రతి సెషన్ గంటసేపు ఉంటుందని, ఒక్కో సెషన్‌కు రూ.250 చొప్పున చెల్లిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం https://ayush.telangana.gov.in/ వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు.