హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వా మ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును అదేరోజు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమో దించింది. గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో న్యాయశాఖ నేడు గెజిట్ జారీ చేసింది.
స్కిల్ యూనివర్సిటీలో 17 కోర్సుల్లో ఏటా 20వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా లోని కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. అలాగే, ఈ యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా వ్యవహరిస్తారని ఇటీవల అమెరికా పర్యటనలో రేవంత్ ప్రకటించారు.