- పెండింగ్ రుణమాఫీని రిలీజ్ చేసిన ప్రభుత్వం
- ‘రైతు పండుగ’ వేదికగా చెక్ అందజేసిన సీఎం
మహబూబ్‌నగర్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ రుణమాఫీకి సంబంధించిన నిధులు రిలీజ్ చేసింది. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో జరిగిన ‘రైతు పండుగ’ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ చెక్కును అందించారు. పెండింగ్‌లో ఉన్న 3 లక్షల 13 వేల 897 మంది రైతులకు సంబంధించి రూ.2,747.67 కోట్లు విడుదల చేశారు.
Also Read : మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు..అభివృద్ధిపై బీఆర్ఎస్ కుట్రలు
దీంతో కలిపి మొత్తంగా 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ ద్వారా రూ. 21 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రూ. 2లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన సీఎం.. అందుకు తగ్గట్టుగా పంద్రాగస్టు వరకు దాదాపు రూ.18 వేల కోట్ల మాఫీ చేశారు. కొందరికి రేషన్ కార్డులు, ఆధార్, బ్యాంక్ అకౌంట్లు, అర్హుల పేర్లు తప్పుగా పడ్డడంతో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో వారికి రుణమాఫీ వర్తించలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చి.. ఆయా రైతుల రైతుల వివరాలు సేకరించింది. మొత్తం డేటాను ఆన్లైన్లో అప్డేట్ చేసింది. తాజాగా పెండింగ్ రుణమాఫీని కూడా విడుదల చేసింది.