
హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‌ను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసింది. ఈ మేరకు శనివారం (ఫిబ్రవరి 22) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఇద్దరు ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. కాగా, రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అలాట్ అయినప్పటికీ కొందరు ఐపీఎస్‌లు ఇప్పటికీ తెలంగాణ కేడర్లోనే కంటిన్యూ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పని చేస్తోన్న ఏపీ కేడర్ అధికారులు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిని వెంటనే ఏపీకి వెళ్లేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం (ఫిబ్రవరి 21) ఆదేశించిన విషయం తెలిసిందే.
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‌ను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి రిలీవ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అభిషేక్ మహంతి రిలీవ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. దీంతో అభిషేక్ మహంతి రిలీవ్ విషయం ఈసీ చేతిలో ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగిలిన ఇద్దరు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయనున్నారు.